కరోనా వల్ల తెలంగాణకు లాభమే.. నష్టమేమీ లేదు: రేవంత్ రెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published May 21, 2020, 7:51 PM IST
Highlights

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంతలా వ్యాప్తి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

కరీంనగర్: కరోనా వైరస్ విజృంభణతో యావత్ దేశం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎలాంటి నష్టం జరక్కపోగా లాభమే జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతల వలన రాష్ట్రానికి రూ.7000 కోట్లు మిగిలాయని...కానీ కరోనా కోసం ఖర్చుపెట్టింది కేవలం రూ.1800 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర సాయంతో పాటు ఇప్పటి వరకు వచ్చిన ఫండ్స్ అదనమని... వాటి లెక్కలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెల్లడించడం లేదని మండిపడ్డారు.  

ప్రజలను అవసరమైన విషయాలను పక్కకు పెట్టడం లో కేసీఆర్ నిష్ఠతనిష్ఠుడని... ప్రపంచవ్యాప్తంగా క్వారంటయిన్ గురించి తెలిపింది తానే అని చెప్పుకుంటున్నాడని అన్నారు. కేసీఆర్ అసమర్థత వలనే కరోన కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. 

కేసీఆర్ కు లాభం వచ్చే వైన్స్ షాప్ తెరవడంతో 45 రోజుల లాక్ డౌన్ నిర్వీర్యమైందన్నారు. అంతేకాకుండా 350 మంది కరోనా పాజిటివ్ పేషంట్స్ ని గాంధీ హాస్పిటల్ నుండి ఇంటికి పంపించారని... ఇంత అసమర్థ పాలన రాష్ట్రంలో నడుస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

కరోన పాజిటివ్ తో చనిపోయిన వారిని కూడా కరోనాతో చనిపోలేదని చెబుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి వాటివల్లే కరోన కేసులు పెరుగుతున్నాయన్నారు. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు కూడా లక్షలల్లో టెస్టులు చేస్తున్నాయని... ఇంత గోరంగా కరోనాను ఎదుర్కోవడంలో విఫలమవడం తెలంగాణ మొదటి స్థానంలో వుందన్నారు. 

read more  ఒక ఫ్యాను మరో లైట్... కరెంట్ బిల్లు మాత్రం రూ.41వేలు: అమర్ నాథ్ రెడ్డి

''పోతిరెడ్డిపాడు విషయంలో ఆంధ్ర వాళ్ళు నీటిని తీసుకొని పోతే కేసీఆర్ కె నీతులు చెప్తారా అని గొప్పలు కు పోతుండు. ఎన్నో మంచి పవర్ ప్రాజెక్టులు తుప్పు కింద కి తేవడానికి కేసీఆర్ కమిషన్ కక్కుర్తి కోసమే చేస్తున్నాడు. రైతుబంధు కేసీఆర్ బ్రతికుండగా పోదు అని హామీ ఇచ్చిన ఇప్పుడు మరి ఆయన చనిపోయినట్లా? బ్రతికున్నట్లా?. కల్యాణ లక్ష్మీ కూడా నేను చెప్పిన వాళ్లనే పెళ్లి చేసుకొంటే ఇస్తా అంటాడా ఏంది'' అని ఎద్దేవా చేశారు. 

''పండించే పంటకు ముందే మద్దతు ధర ప్రకటిస్తే రైతులు అనుకూలంగా పంటలు వేస్తారు కానీ నేను చెప్పిందే వేయాలి అని నియంతృత్వ పోకడకు పోవడం ఏమిటి. రైతుబంధు ఎగణామం పట్టడానికి ఈ డొంకతిరుగుడు. ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్మీట్ కేవలం నవ్వుకోవడానికే తప్ప ప్రజల కోసం ఒక విలువైన మేలైన ప్రయోజనం గురించి చెప్పాడా?'' అని ప్రశ్నించారు. 

''రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ అందరికి రూ.10000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. నిధులు పోయే...నియామకాలు పోయే...ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కేసీఆర్ కు కేవలం మందు గురించి అడిగితే బాగా చెప్తాడు'' అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

click me!