గోదావరిఖనిలో విషాదం: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Published : Apr 14, 2023, 02:48 PM IST
గోదావరిఖనిలో  విషాదం: ఈతకు వెళ్లి  ముగ్గురు  మృతి

సారాంశం

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఈతకు  వెళ్లి  ముగ్గురు  చిన్నారులు మృతి చెందారు.  నీటికుంటలో  ఈతకు  వెళ్లి  వీరు  చనిపోయారు.  


పెద్దపల్లి: జిల్లాలోని  గోదావరిఖని  న్యూపొరట్ పల్లిలో శుక్రవారంనాడు   విషాదం  చోటు  చేసుకుంది.  ఈతకు వెళ్లి  ముగ్గురు  చిన్నారులు మృతి చెందారు. అంబేద్కర్ జయంతిని  పురస్కరించుకొని  ఇవాళ  స్కూల్ కు  సెలవు   కారణంగా   చిన్నారులు  ఈతకు  వెళ్లారు.  తమ ఇళ్లకు  సమీపంలోని  నీటికుంటలో  ఈతకు  వెళ్లారు.  నీటి కుంటలో  మునిగి  ముగ్గురు  చిన్నారులు  మృతి చెందారు. మరో ఇద్దరు  చిన్నారులను  రక్షించారు.  వారిని  ఆసుపత్రికి తరలించారు. మృతులను  
ఉమామహేష్,  సాయి చరణ్, విక్రం లు  గా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu