బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భూవివాద ఆరోపణలు..

By AN TeluguFirst Published Nov 26, 2021, 3:39 PM IST
Highlights

లోథ్ సమాజ్ యువత ఒకసారి ఆలోచించి, వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందంటూ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ తన సామాజిక వర్గానికే చెందిన వారు వచ్చి land విషయంలో ఫిర్యాదు చేయగా, ఆ స్థలం ప్రైవేటుదా? ప్రభుత్వ స్థలమా? అని నిర్ధారించాలని తాసిల్దార్ కు లేఖ రాశాను అన్నారు.

హైదరాబాద్ :  గోషామహల్ ఎమ్మెల్యే Rajasingh పై సోషల్ మీడియా వేదికగా మాజీ కార్పొరేటర్, టిఆర్ఎస్ కు చెందిన Mukesh Singh తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళ్ హాట్ డివిజన్ పరిధిలోని దిలావర్ గంజ్ లో ఉన్న నాలుగు వందల రెండు గజాల భూమి విషయంలో వీరి మధ్య వివాదం రాజుకుంది. సదరు భూమి ప్రభుత్వ స్థలమని ఎమ్మెల్యే అసిఫ్ నగర్ తాసిల్దార్ కు లేఖ రాశారని,  అధికారులు అది ప్రైవేటు స్థలమని నిర్ధారించారని మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్ ఆరోపించారు.  

సోషల్ మీడియా వేదికగా ఆయన.. ఎమ్మెల్యే తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే అన్యాయం చేస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రమేష్ పట్టేదార్ బోరు వేసే విసయం మొదలు కొన్ని మగ్రా, దూల్పేట్ లలో స్థల వివాదాలు, Hazare Bhavan కూల్చివేయాలని తదితర అంశాల్లో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.  

లోథ్ సమాజ్ యువత ఒకసారి ఆలోచించి, వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందంటూ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ తన సామాజిక వర్గానికే చెందిన వారు వచ్చి land విషయంలో ఫిర్యాదు చేయగా, ఆ స్థలం ప్రైవేటుదా? ప్రభుత్వ స్థలమా? అని నిర్ధారించాలని తాసిల్దార్ కు లేఖ రాశాను అన్నారు.

సమస్య ఉందని తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేసేందుకు లేఖ ఇచ్చానని, అయినా తను ప్రశ్నించే అధికారం ముఖేష్‌ సింగ్‌కు లేదు అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మరో వీడియోను పోస్ట్ చేశారు.  దీనిపై ముఖేష్ సింగ్ మాట్లాడుతూ  ఎమ్మెల్యే ల వల్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  బాధితుల పక్షాన ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

ముఖేష్‌ సింగ్‌ మాట్లాడుతూ ఇదే స్థలం విషయంలో 2019లో కొందరు వచ్చి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులకు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. 

వివాహేతర సంబంధం : భార్యతో ఎస్సై ఎఫైర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త ...

ఇదిలా ఉండగా, అక్టోబర్ 23న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు.. telangana మంత్రి KTR ఘాటు రిప్లై ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం .. హైదరాబాద్‌లో వర్ష పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనతో పాటు మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేళ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానన్నారు. 

హైదరాబాద్ అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రమని ప్రజలకు కాదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్.. twitter వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. గత కొద్ది కాలంగా Petrol, diesel ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో.. ముందు వాటి గురించి ప్రజల అభిప్రాయాలను అడగండి అంటూ.. కేటీఆర్ రాజాసింగ్ కి సూచించారు, ‘పెట్రల్ బంక్ కి వెళ్లి.. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ ఎలా పెరుగుతున్నాయో మీరు ఎందుకు తెలుసుకోకూడదు? అంతేకాదు.. సామాన్యుల ఇళ్లకు వెళ్లి.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరుగుతుందో కూడా అడగొచ్చు. దేశంలో gdp అంటే గ్యాస్, డీజిల్ పెట్రోల్ పెంచడమని అర్థమా..?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

click me!