బీజేపీలో చేరిన విఠల్.. కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి అబ్బాస్ నక్వీ..

By SumaBala BukkaFirst Published Dec 6, 2021, 1:49 PM IST
Highlights

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఎస్పిఎస్సి సభ్యుడిగా నియమితులైన విఠల్ పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠల్ జాతీయ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత విటల్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం కూడా జరిగింది. అయినా అది సాధ్యం కాలేదు. 

telangana బిజెపిలోకి చేరికలు జోరందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ch vittal సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సమక్షంలో బీజేపీలో చేరారు. తరుణ్ ఛుగ్, బండి సంజయ్ లు విఠల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. Telangana JAC ప్రధాన కార్యదర్శిగా, కో- చైర్మన్ గా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఎస్పిఎస్సి సభ్యుడిగా నియమితులైన విఠల్ పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠల్ జాతీయ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత విటల్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం కూడా జరిగింది. అయినా అది సాధ్యం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల కెసిఆర్ సర్కారు తీరును ఆయన ముందునుంచి తప్పుపడుతున్నారు.  

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన  Palamuru-Rangareddy project డిజైన్ మార్చడాన్ని విమర్శించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తికి లోనయ్యారు 

ఇదే అదనుగా విఠల్ ను సంప్రదించిన బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన విఠల్ చేరికతో  తెలంగాణలో  బీజేపీలో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2023 టార్గెట్గా తెలంగాణ బీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? ఇప్పటి నుంచే అభ్యర్థుల వేట మొదలుపెట్టిందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఈటెల రాజేందర్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మీదున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కమలం శ్రేణులు. 

బీజేపీలోకి చేర‌నున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. ఎప్పుడంటే?

అధికార పార్టీతో పోటీ పడేది తామే అంటున్న కమలనాథులు.. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారట. గత రెండేళ్లలో కొన్నిచోట్ల గెలుపులు తెలంగాణ బిజెపిలో కొత్త జోష్ నింపాయి.  ఇదే ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది బీజేపీ. రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలేవి లేవు. అందుకే ఇక 2023 తమ టార్గెట్ అంటుంది కమలం పార్టీ. బీజేపీలో మరికొందరు చేరబోతున్నారనే ప్రచారం మధ్య విఠల్ చేరడం.. రాజకీయంగా బలం చేకూరుతుంది. 

అంతకు ముందు తాజాగా బిజెపిలోకి  క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఉద్యమకారుడు విటల్ చేరుతారనే వార్తలు బాగా ప్రచారం అయ్యాయి.  విఠల్ తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా చైర్మన్గా ఉద్యమ సమయంలో పని చేశారు.  ఈరోజు బీజేపీలో చేరారు.  తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో అతనికి బిజెపి పార్టీ అండగా నిలిచింది. 
 

click me!