Karimnagar MLC Election: సంపుకుంటారా లేక సాదుకుంటారా?: ఈటల స్టైల్లోనే రవీందర్ సింగ్ ఎమోషనల్ క్యాంపెయిన్

Arun Kumar P   | Asianet News
Published : Dec 06, 2021, 01:16 PM ISTUpdated : Dec 06, 2021, 01:22 PM IST
Karimnagar MLC Election: సంపుకుంటారా లేక సాదుకుంటారా?: ఈటల స్టైల్లోనే రవీందర్ సింగ్ ఎమోషనల్ క్యాంపెయిన్

సారాంశం

అధికార టీఆర్ఎస్ పై తిరుగుబాటు ప్రకటించి కరీంనగర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ప్రచారంలో ఈటల రాజేందర్ ను ఫాలో అవుతున్నాడు. ఎమోషనల్ కామెంట్స్ తో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 

కరీంనగర్: తెలంగాణలో స్థానిక  సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వున్నా ముందుజాగ్రత్తలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించారు. ఈ క్యాంపు రాజకీయాలపైనే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు కరీంనగర్ ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు. 

సోమవారం karimnagar పట్టణంలోని హోటల్ తారకలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ ఇష్టానుసారం ఓటేసుకునే అవకాశం లేదంటూ స్వయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బెదిరిస్తున్నారని ఆరోపించారు.  పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం... మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో మాకు తెలుస్తుందంటూ ఓటర్లను minister errabelli dayakar rao బెదిరిస్తున్నారని రవీందర్ పేర్కొన్నారు. ఈ బెదిరింపులపైనా ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు ravinder singh సింగ్ తెలిపారు.

VIDEO

వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి కరీంనగర్ ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని అన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసిలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుహక్కు కలిగిన ఏ ఒక్కరు భయపడవద్దని... తమ ఇష్టానుసారం ఓటెయ్యాలని రవీందర్ సింగ్ సూచించారు. 

read more  పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ టీఆర్ఎస్ కు షాకిస్తాడా?... ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వివాదంలో మంత్రి కొప్పుల (వీడియో)

''నేను పోటీ చేస్తున్నది మీ అందరికి కోసమే. కాబట్టి నన్ను చంపుకుంటారో గుండెల్లో పెట్టుకుని సాదుకుంటారో మీ ఇష్టం.  కానీ ఎంపిటిసి, జడ్పీటిసి, కార్పొరేటర్స్ కి చెబుతున్నా... ఎవ్వరూ ఎవ్వరికి భయపడకండి. వారి దగ్గర ధనం, అధికార బలం మాత్రమే ఉన్నది... మన దగ్గర ప్రజా బలం వుంది'' అన్నారు. 

''ఎమ్మెల్సిగా గెలిచాక మీ సమస్యల పరిష్కరిస్తారానికై పోరాడుతా. అలా చేయకపోతే నా పదవికి రాజీనామా చేస్తాను. ఇంతకుముందు ఎమ్మెల్సీగా గెలిచినవారు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. మీకు కు ఏనాడు గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తేనే మీకు బెంగుళూరు, మైసూర్ క్యాంపులకు తీసుకెళ్లారు. లేదంటే మిమ్మల్సి పట్టించుకునేవారు కాదు'' అని రవీందర్ సింగ్ పేర్కొన్నారు. 

read more  అధికార టీఆర్ఎస్ పై పోటీ... కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ పై కేసు నమోదు

రైతులు పండించిన వరి ధాన్యాన్ని తరలించాలంటే లారీలు లేవంటున్న మున్సిపల్ మంత్రి కేటీఆర్ వందల లారీలను ఇసుక తరలింపుకు వాడుతున్నారని ఆరోపించారు.మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కనీసం ఒక్కరోజయినా  కార్పొరేటర్, ఎంపిటిసిలకు శిక్షణ తరగతులు నిర్వహించారా? అని కేటీఆర్ ను నిలదీసారు. 

ఇదిలావుంటే ఎమోషనల్ గా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల మనసులు గెలుచుకుని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న రవీందర్ సింగ్ ఇతర పార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇందుకోసం ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కూడా కలిసారు. 

కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో లేనందున తనకు అనుకూలంగా ఓట్లు వేయించాలని వీరిని రవీందర్ సింగ్ ఆభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచిన తనకు అండగా నిలిచి తన గెలుపునకు సహకరించాలని రవీందర్ సింగ్ కోరారు. దీనిపై ఇద్దరు నేతలతో కొద్దిసేపు చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?