రేపు బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ విజయశాంతి

Published : Dec 06, 2020, 10:41 AM ISTUpdated : Dec 06, 2020, 11:04 AM IST
రేపు బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ విజయశాంతి

సారాంశం

మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సోమవారం నాడు (డిసెంబర్ 07)  బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరనున్నారు.

హైదరాబాద్: మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సోమవారం నాడు (డిసెంబర్ 07)  బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరనున్నారు.

బీజేపీలో చేరిన తర్వాత ఆమె పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.  బీజేపీ అగ్రనేతలతో కూడా ఆమె సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. కొద్ది రోజులుగా ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకొంటారని ప్రచారం సాగుతోంది. 

గతంలో పలుమార్లు ఆమె బీజేపీలో చేరుతారని ప్రకటించారు. కానీ  ఆమె బీజేపీలో చేరలేదు. సోమవారం నాడు ఆమె బీజేపీలో చేరుతారని  బీజేపీ వర్గాలు తెలిపాయి.సోమవారం నాడు ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి భేటీ కానున్నారు.

also read:నడ్డాతో భేటీ: అమిత్ షా సమక్షంలో బిజెపిలోకి విజయశాంతి

ఆదివారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఢిల్లీకి వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత జేపీ నడ్డా, అమిత్ షాలను సంజయ్ కలిసే అవకాశం ఉంది.

బీజేపీ ద్వారానే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి టీఆర్ఎష్ లో చేరారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆమె 2014 కు ముందు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్  నుండి ఆమె మరోసారి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే