తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో ఉన్నది ఇక 8,125 కేసులే

Arun Kumar P   | Asianet News
Published : Dec 06, 2020, 09:45 AM ISTUpdated : Dec 06, 2020, 10:07 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో ఉన్నది  ఇక 8,125 కేసులే

సారాంశం

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకు తగ్గుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 57308మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 622 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,73,341కి చేరగా టెస్టుల సంఖ్య 57,79,490కు చేరింది.

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 993 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,63,744కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 8,125 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో కేవలం ఇద్దరు మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1472కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.48శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 104కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 51, రంగారెడ్డి 55, భద్రాద్రి కొత్తగూడెం 29, కరీంనగర్ 27, ఖమ్మం 23, సంగారెడ్డి 18, సూర్యాపేట 15, వరంగల్ అర్బన్ 33, నల్గొండ 29, మంచిర్యాల 17, జగిత్యాల15, సిరిసిల్ల 15, నిజామాబాద్ 13, ములుగు 12, సిద్దిపేట 16 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 


 

PREV
click me!

Recommended Stories

Railway: జీడిపప్పు వ్యాపారి చేసిన ప‌నికి దిగొచ్చిన ఇండియ‌న్ రైల్వే.. రూ.35,000 నష్టపరిహారం
Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం | Bhatti Vikramarka | Asianet