ఖమ్మం నుండే కేసీఆర్ పతనం: బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్

By narsimha lode  |  First Published Jul 2, 2023, 11:22 AM IST


ఇవాళ ఖమ్మంలో  తాము నిర్వహించే  సభకు  బీఆర్ఎస్  అడ్డంకులు  సృష్టిస్తుందని  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 


ఖమ్మం:  కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుండి  ప్రారంభం కానుందని మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   చెప్పారు.ఆదివారంనాడు  ఆయన  ఖమ్మంలో  మీడియాతో మాట్లాడారు.  రాహుల్ గాంధీ  సభకు  అధికార బీఆర్ఎస్ అడ్డంకులు  సృష్టిస్తుందన్నారు.   అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు  సృష్టించిన రాహుల్ గాంధీ సభను విజయవంతం  చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  నిన్న రాత్రి నుండి  భయానక వాతావరణం సృష్టిస్తున్నారని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  గతంలో  ఖమ్మంలో  బీఆర్ఎస్ నిర్వహించిన సభను తలదన్నేలా  రాహుల్ గాంధీ  సభ ఉంటుందని   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.  

తమ పార్టీ నేత మువ్వా విజయ్ కుమార్ ను హత్య  చేస్తామని  వెలిసిన  పోస్టర్లపై  విజయ్ కుమార్ భార్య  ఖమ్మం సీపీని  కలిసేందుకు  ప్రయత్నిస్తే  ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.ఒక ఆడబిడ్డకు ఇచ్చే  మర్యాద ఇదేనా అని ఆయన  ప్రశ్నించారు. తమను బెదిరిస్తూ  వెలిసిన  పోస్టర్లపై   పోలీసుల తీరుపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Latest Videos

ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు  ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారన్నారు. జిల్లా సరిహద్దులో  ప్రైవేట్ వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలు అడ్డుకుంటున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని  ఆయన చెప్పారు.
ప్రభుత్వ కనుసన్నల్లో అధికారులు  పనిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  విమర్శలు చేశారు. జిల్లా సరిహద్దులో రోడ్డు మూసివేసి  సభకు  జనం రాకుండా అడ్డుకుంటున్నారని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.

also read:ఖమ్మంలోకి భట్టి పాదయాత్ర: మూడు మాసాల తర్వాత స్వంత జిల్లాకు సీఎల్పీ నేత

 కాంగ్రెస్  పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు  గురి చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. ఇప్పటికే  1700 ప్రైవేట్  వాహనాలను సీజ్ చేశారన్నారు.  రాహుల్ గాంధీ సభకు  వెళ్తే  పథకాలు  రావని బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు  చేసినా కూడ  తాను  సత్యాగ్రహ  మార్గంలో  పనిచేస్తానని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తేల్చి చెప్పారు. 

 

click me!