ఐటీ కంపెనీలకు, పారిశ్రామిక సంస్థలకు, పచ్చని ప్రకృతికి చేవేళ్ల కేంద్రం. రెడ్డి సామాజిక వర్గమే తొలి నుంచి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. హేమాహేమీలైన కొండా వెంకట రంగారెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి వారు ఈ ప్రాంతం వారే. 2009లో చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎస్ జైపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు విజయం సాధించారు. చేవేళ్లలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి బదులుగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు టికెట్ కేటాయించారు. బీజేపీ సైతం బలమైన అభ్యర్ధిని బరిలోకి దించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో వుండే పార్లమెంట్ నియోజకవర్గం చేవేళ్ల. అర్భన్, రూరల్ ప్రాంతాల కలయికతో వుండే ఈ సెగ్మెంట్‌లో రాజకీయాలు విభిన్నంగా వుంటాయి. ఆంధ్ర ప్రాంత సెటిటర్లు ఇక్కడి అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తూ వుంటారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. హేమాహేమీలైన కొండా వెంకట రంగారెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి వారు ఈ ప్రాంతం వారే. ఐటీ కంపెనీలకు, పారిశ్రామిక సంస్థలకు, పచ్చని ప్రకృతికి చేవేళ్ల కేంద్రం. రెడ్డి సామాజిక వర్గమే తొలి నుంచి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది.
చేవేళ్ల ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. రూరల్, అర్బన్ ఓటర్ల సమ్మేళనం :
undefined
2009లో చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎస్ జైపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు విజయం సాధించారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవేళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 24,43,112 మంది. వీరిలో పురుషుల సంఖ్య 11,78,288 మంది.. మహిళా ఓటర్ల సంఖ్య 12,64,594 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 13,00,194 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 53.22 శాతం పోలింగ్ నమోదైంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ జీ రంజిత్ రెడ్డికి 5,28,148 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 5,13,831 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి జనార్థన్ రెడ్డికి 2,01,960 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 14,317 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
చేవేళ్ల ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో బలమైన అభ్యర్ధులు :
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేవేళ్లపై కన్నేసింది. ఇక్కడ ఎట్టిపరిస్ధితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. చేవేళ్ల ప్రాంతంలో పట్నం కుటుంబానికి వున్న పట్టును దృష్టిలో వుంచుకుని మహేందర్ రెడ్డి సతీమణి , వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ పేరు కూడా పరిశీలనలో వుంది.
బీఆర్ఎస్ విషయానికి వస్తే.. చేవేళ్లలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి బదులుగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు టికెట్ కేటాయించారు. బీజేపీ సైతం బలమైన అభ్యర్ధిని బరిలోకి దించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హేమాహేమీలైన అభ్యర్ధులు బరిలో నిలవడంతో చేవేళ్లలో ఈసారి రాజకీయాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి.