వివేకంతో ఓటేయాలి: టీడీపీ శ్రేణులను కోరిన తుమ్మల నాగేశ్వరరావు

By narsimha lode  |  First Published Nov 2, 2023, 5:48 PM IST

టీడీపీ శ్రేణులను తమ వైపునకు తిప్పుకొనేందుకు  కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.  ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపునకు వచ్చేలా ప్రయత్నిస్తున్నాయి.  ఈ విషయమై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
 


ఖమ్మం: ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు వివేకంతో ఓటేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గురువారంనాడు ఖమ్మంలో జరిగిన  ఆత్మీయ సమ్మేళనంలో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయన్నారు. 
చంద్రబాబును జైలు పాలు శక్తులు ఎవరో మీకు తెలుసునన్నారు.  

తనకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇస్తే  చంద్రబాబు తనను ప్రోత్సహించారని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఖమ్మం అభివృద్దికి కృషి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో  ఖమ్మంలో అరాచకం,  భూకబ్జాలు పెరిగాయని  తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

Latest Videos

ఈ దఫా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.  2009లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు  టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. పాలేరు నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ  ఈ స్థానం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని  కాంగ్రెస్ పోటీకి దింపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో  పాలేరు నుండి కాకుండా  ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.

బీఆర్ఎస్ టిక్కెట్టు నిరాకరించడంతో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో, తెలంగాణలో  మంత్రిగా పనిచేశారు తుమ్మల నాగేశ్వరరావు.  ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు పనిచేశారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత  కేసీఆర్ మంత్రివర్గంలో కూడ తుమ్మల నాగేశ్వరరావు పనిచేశారు.టీడీపీ ఆవిర్భావంతో  ఆ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు  ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పిలుపుతో  తుమ్మల నాగేశ్వరరావు  టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 

also read:ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2018 ఎన్నికల్లో పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి  తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్  విజయం సాధించారు. అయితే కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు కందాల ఉపేందర్ రెడ్డికే దక్కింది.  దీంతో  తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 
 

click me!