కేటీఆర్ ఆహ్వానం: కేసీఆర్‌తో పొన్నాల లక్ష్మయ్య భేటీ

By narsimha lode  |  First Published Oct 15, 2023, 3:48 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  ఇవాళ భేటీ అయ్యారు. మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.



హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  ఆదివారంనాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్  నిన్న  పొన్నాల లక్ష్మయ్యతో  భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లో చేరాలని పొన్నాల లక్ష్మయ్యను  కేటీఆర్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు  పొన్నాల లక్ష్మయ్య  ఇవాళ కేసీఆర్ తో సమావేశమయ్యారు.  

కాంగ్రెస్ పార్టీలో  45 ఏళ్ల పాటు పనిచేసిన తనను అనేక అవమానాలకు గురి చేశారని  పొన్నాల లక్ష్మయ్య  పేర్కొన్నారు.  పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను అధిష్టానానికి   వివరించే ప్రయత్నం చేసినా కూడ పట్టించకొనే పరిస్థితి లేదని  రాజీనామా  లేఖలో  పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

Latest Videos

undefined

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  చివరి నిమిషంలో  పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది.  పీసీసీ అధ్యక్షుడిగా,  మాజీ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు  టిక్కెట్టు కేటాయింపు విషయంలో  ఇబ్బందులు నెలకొన్నాయి.  తన టిక్కెట్టు కోసం  ఢిల్లీ, హైద్రాబాద్ చుట్టూ పొన్నాల లక్ష్మయ్య చక్కర్లు కొట్టారు. గత ఎన్నికల్లో అతి కష్టం మీద టిక్కెట్టు దక్కించుకున్నప్పటికి  పొన్నాల లక్ష్మయ్య ఓటమి పాలయ్యారు. 

also read:రేవంత్ ఓడిపోలేదా, అతని వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది.. కేసీఆర్‌తో భేటీ తర్వాతే తుది నిర్ణయం : పొన్నాల

ఈ దఫా కూడ జనగామ టిక్కెట్టు విషయమై  పొన్నాల లక్ష్మయ్యకు నిరాశే ఎదురయ్యే పరిస్థితి నెలకొందనే ప్రచారం సాగింది.  కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఈ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు దక్కే అవకాశం ఉందనే  ప్రచారం సాగింది. దీంతో  పొన్నాల లక్ష్మయ్య  కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ నాయకత్వంతో పొన్నాల లక్ష్మయ్య టచ్ లోకి వెళ్లారనే ప్రచారం కూడ లేకపోలేదు.  రెండు రోజుల క్రితం  కాంగ్రెస్ కు  పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు.రేపు జనగామలో జరిగే  బీఆర్ఎస్ సభలో పొన్నాల లక్ష్మయ్య  ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.  ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  పొన్నాల లక్ష్మయ్య కు కీలక పదవిని  ఇచ్చే అవకాశం లేకపోలేదనే  ప్రచారం సాగుతుంది.

click me!