అనుచరులతో రేపు జూపల్లి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

By narsimha lode  |  First Published Apr 10, 2023, 10:10 PM IST

 
మాజీ మంత్రి జూపల్లి  కృష్ణారావు  భవిష్యత్తు  కార్యాచరణప ై కసరత్తు  చేస్తున్నారు.  రేపు   కొల్లాపూర్ లో  తన  అనుచరులతో  జూపల్లి  కృష్ణారావు సమావేశం కానున్నారు. 


హైదరాబాద్: మాజీ  మంత్రి  జూపల్లి  కృష్ణారావు  ఈ నెల 11న  తన అనుచరులతో  కొల్లాపూర్ లో  సమావేశం  కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై  జూపల్లి  కృష్ణారావు  అనుచరులతో  చర్చించనున్నారు.  జూపల్లి  కృష్ణారావు , మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలపై  బీఆర్ఎస్ నాయకత్వం  ఇవాళ  సస్పెన్షన్ వేటేసింది.   దరిమిలా  భవిష్యత్తు  కార్యాచరణపై  జూపల్లి  కృష్ణారావు  చర్చించనున్నారు. 

చాలా కాలంగా  బీఆర్ఎస్ ను  జూపల్లి  కృష్ణారావు వీడుతారని  ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్  సస్పెన్షన్  వేటు  వేయడంతో  జూపల్లి  కృష్ణారావు తన భవిష్యత్తు  కార్యాచరణను  ప్రకటించనున్నారు.

Latest Videos

2018  అసెంబ్లీ  ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ  చేసిన  జూపల్లి  కృష్ణారావు  ఓటమి పాలయ్యాడు.  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ  చేసిన  బీరం  హర్షవర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో  చేరాడు.  హర్షవర్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో  చేరిన తర్వాత  రాజకీయ పరిణామాలు  మారాయి.  హర్షవర్ధన్ రెడ్డి  , జూపల్లి  కృష్ణారావు  వర్గాల మధ్య  పొసగలేదు . ఇరువర్గాల  మధ్య  సఖ్యత కోసం  పార్టీ నాయకత్వం  ప్రయత్నించింది.  కానీ  ఇరువర్గాల  మధ్య  గ్యాప్  పెరుగుతూనే  వచ్చింది.  స్థానిక సంస్థల  ఎన్నికల సమయంలో  తమ ఆధిపత్యం  కోసం  ఇరువర్గాలు ప్రయత్నించాయి.  జూపల్లి  కృష్ణారావు  తన  మనుషులను  బరిలోకి దింపి గెలిపించుకున్నాడు.    జూపల్లి కృష్ణారావు,  హర్షవర్ధన్ రెడ్డి ల  మధ్య  సవాళ్లు , ప్రతి సవాళ్లు  చోటు  చేసుకున్నాయి. నియోజకవర్గ అభివృద్దిపై  ఇద్దరు నేతలు   సవాళ్లు విసురకున్నారు. ఈ సవాళ్లతో  కొల్లాపూర్ లో  ఉద్రిక్త  పరిస్థితులు  కూడా  నెలకొన్నాయి.   

గత  ఏడాది  కేటీఆర్  స్వయంగా  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావుతో  చర్చించారు.  దీంతో  హర్షవర్ధన్ రెడ్డి , జూపల్లి  కృష్ణారావు మధ్య  గ్యాప్  తగ్గే అవకాశం ఉందని  భావించారు.  కానీ  దానికి విరుద్దంగా జరిగింది . నియోజకవర్గ  అభివృద్దిపై  సవాళ్లు విసురుకున్నారు.   ఇక  కొంతకాలంగా  జూపల్లి  కృష్ణారావు  బీఆర్ఎస్ ను వీడుతారని  ప్రచారం సాగుతుంది.  గత  ఏడాది లో  జూపల్లి  కృష్ణారావు  మండలాల వారీగా   అనుచరులతో  సమావేశాలు  నిర్వహించారు.

also read:సంచలన నిర్ణయాలకు కేరాఫ్ జూపల్లి: నాడు కాంగ్రెస్‌కు , నేడు బీఆర్ఎస్‌కు దూరం

 కానీ  పార్టీ మార్పు విషయమై  స్పష్టత ఇవ్వలేదు. కొత్తగూడెం  లో  నిన్న  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి నిన్న  అనుచరులతో జూపల్లి  కృష్ణారావు  హాజరయ్యారు.   దీంతో  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులపై  బీఆర్ఎస్ నాయకత్వం వేటేసింది.  ఈ విషయమై  జూపల్లి  కృష్ణారావు  రేపు  తన అనుచరులతో  సమావేశం  కానున్నారు.

click me!