హుజూరాబాద్‌లో ఎన్నికలు జరిగితే ప్రజలంతా అండగా ఉంటారు: గంగులపై ఫైర్

By narsimha lodeFirst Published May 18, 2021, 11:15 AM IST
Highlights

 2023 తర్వాత నీవు అధికారంలో ఉండవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

హుజూరాబాద్: 2023 తర్వాత నీవు అధికారంలో ఉండవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.మంగళవారం నాడు ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.గత 20 సంత్సరకాలంగా హుజూరాబాద్ నియోజక వర్గం తెలంగాణ ఉద్యమంలో అగ్రబాగాన నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన  మీద కక్ష్యపురితం గా వ్యవహరించిన నా నియోజక వర్గ ప్రజలను మాత్రం వ్యవహరించవద్దని ఆయన కోరారు. ఇవాళ  ఇంఛార్జి గా వచ్చిన వాళ్ళు గతం లో నియోజక వర్గం లో ఒక సర్పంచ్ ను అయిన గెలిపించారా అని ఆయన ప్రశ్నించారు.

రేపు అభివృద్ధి పనులకు ఫండ్స్ రావాలంటే టి ఆర్ ఎస్ పార్టీ తో ఉండాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.ఈ  విషయాలను ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.  దేవుళ్ళ కంటే ఎక్కువ హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలను మొక్కుతానని ఆయన చెప్పారు. తాను  ఛాలెంజ్ చేసి చెప్తున్న అన్ని దిక్కుల రాజకీయం చేసినట్టు హుజూరాబాద్ నియోజక వర్గం లో నడువవని చెప్పారు.హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలను ఎవరు కొనలేరన్నారు. నాగార్జున సాగర్ లో చేసినట్టు చేస్తాం అంటే నడువదన్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు ఒకవేళ జరిగితే హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలు అందరూ అండగా ఉంటారని ఆయన చెప్పారు.  నీ దాదాగిరి నీ హెచ్చరికలు బంద్ చేయక పోతే కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేయవలసి వస్తోందన్నారు.

click me!