కరోనాతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంఫైర్ వేమూరి సుధాకర్ మృతి..

By AN TeluguFirst Published May 18, 2021, 11:04 AM IST
Highlights

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంఫైర్ సుధాకర్ కరోనాతో మృతిచెందారు 3 ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ మ్యాచుల్లో అఫీషియల్గా పాల్గొన్న తెలుగు వ్యక్తి వేమూరి సుధాకర్ కరోనాతో పోరాడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంఫైర్ సుధాకర్ కరోనాతో మృతిచెందారు 3 ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ మ్యాచుల్లో అఫీషియల్గా పాల్గొన్న తెలుగు వ్యక్తి వేమూరి సుధాకర్ కరోనాతో పోరాడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజల్లో విపరీత భయాందోళనలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ లు వేసుకున్నా మరణాలు నమోదవుతుండడం మరింత ఆందోళన కరంగా మారింది. 

తాజాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంఫైర్ సుధాకర్ కూడా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. మొదటి వేవ్ లోనూ కరోనా బారిన పడిన ఆయన బయటపడ్డారు. కానీ రెండో వేవ్ లో మృత్యువాత పడ్డారు. 

 హైదరాబాద్కు చెందిన 72 ఏళ్ల సుధాకర్ మొదట సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ మీద ఆసక్తితో అటువైపు దృష్టి సారించారు. నిరుడు కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. కానీ తిరిగి కోలుకున్నారు.

సెకండ్ వేవ్ నేపథ్యంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా రాకాసి పంజా నుంచి ఆయన తప్పించుకోలేక పోయారు. సుధాకర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్లకు అంతర్జాతీయ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

click me!