కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజల విజయం: హుజూరాబాద్ ఫలితంపై ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published Nov 3, 2021, 11:02 AM IST
Highlights

హుజూరాబాద్ ఓటర్లు టీఆర్ఎష్ నేతలకు బుద్ది చెప్పారని మాజీ మంత్రి, హూజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.  ఈ ఉపఎన్నికల్లో తన గెలుపు కేసీఆర్ అహంకారంపై గెలుపుగా ఆయన పేర్కొన్నారు.

హుజూరాబాద్:  హుజూరాబాద్ లో తన గెలుపు కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభివర్ణించారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పారన్నారు.

also read:Huzurabad bypoll Result 2021: నాడు దుబ్బాక, నేడు హుజూరాబాద్‌, బీజేపీకి కలిసొచ్చిన సెంటిమెంట్

బుధవారం నాడు హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుండి తనను వెళ్లగొట్టాక బీజేపీ అక్కున చేర్చుకొందని Etela Rajender చెప్పారు. Amit shahపిలిచి అండగా ఉంటామని మొదటగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.  తనకు అండదండలు అందించిన అమిత్ షా కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. Bjp జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన గెలుపులో కీలకంగా వ్యవహరించారని ఆయన  చెప్పారు.

Huzurabad bypoll లో ఓటర్లను Trs నేతలు ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా కూడా ఓటర్లు చైతన్యవంతంగా వ్యవహరించి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పారని ఈటల రాజేందర్ చెప్పారు. దళిత బంధు పథకం కింద వచ్చే రూ. 10 లక్షలకు తాము అమ్ముడుపోమని దళితులు తనకు చెప్పారని రాజేందర్ తెలిపారు. కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారన్నారు. అయినా కూడా ఎవరూ లొంగలేదని  రాజేందర్ చెప్పారు.

టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్న సమయంలో ఈ నియోజకర్గంలోని సుమారు 40 గ్రామాల ప్రజలు వారిని తన్ని తరిమివేశారన్నారు.కుట్రదారుడు కుట్రల్లోనే నాశనం అయిపోతాడని  పరోక్షంగా ఈటల రాజేందర్  కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కుట్రలు చేసిన వారికి ఏనాడూ కూడా మంచి జరగదని ఆయన చెప్పారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీవు కానీ నీ అల్లుడిని కానీ పోటీ చేయాలని తాను చేసిన సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.. తనపై శ్రీనివాస్ యాదవ్ ను పోటీకి రెండు గుంటల వ్యక్తి అంటూ ప్రచారం చేశారని రాజేందర్ చెప్పారు. అయితే రెండు గుంటల వ్యక్తి అయతే రూ. 400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ఆయన టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.

హుజూరాబాద్ లో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురి చేశారని రాజేందర్ ఆరోపించారు. ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా చేశారన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా కూడా ప్రజలంతా తన వైపే నిలబడ్డారని రాజేందర్ చెప్పారు.హుజూరాబాద్ అభివృద్దికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని  ఆయన చెప్పారు. హుజూరాబాద్ ప్రజలంతా  నిన్ననే దీపావళిని చేసుకొన్నారని రాజేందర్ తెలిపారు. ఎవరికి వారే ఈ ఉప ఎన్నికల్లో తన విజయం కోసం  పనిచేశారన్నారు. ఆరు మాసాలుగా ప్రభుత్వ యంత్రాంగం హుజూరాబాద్ లో కేంద్రీకరించినా కూడా ప్రజలంతా తన వైపే ఉన్నారన్నారు.

హుజూరాబాద్‌లో తన గెలుపు అందరి గెలుపుగా ఆయన పేర్కొన్నారు.తన విజయం కోసం బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావులతో పాటు బీజేపీకి చెందిన అగ్రనేతలు వచ్చి సహకరించారని ఆయన చెప్పారు.
 

click me!