ఐదేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు లైంగి దాడి...

Published : Nov 03, 2021, 10:08 AM IST
ఐదేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు లైంగి దాడి...

సారాంశం

చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు Sexual assaultకి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్కింట్లో ఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్న శంకరంపేట పోలీస్ ను ఆశ్రయించారు. 

మెదక్ : ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు లైంగి దాడికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మద్యాహ్నం చోటు చేసుకుంది. సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 

చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు Sexual assaultకి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్కింట్లో ఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్న శంకరంపేట పోలీస్ ను ఆశ్రయించారు. 

పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, boy పరారీలో ఉన్నాడని తెలిసింది. 

యువతి అదృశ్యం..
నారాయణఖేడ్ : కుటుంబం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నారాయణఖేడ్ మండలం శేరితండాకు చెందిన ఓ మహిళ అక్టోబర్ 29న తన కూతురును ఇంటిలో ఉంచి కొడుకు, కోడలితో కలిసి అల్లాపూర్ శివారులో కౌలుకు తీసుకున్న చేలో పత్తిని తెంచడానికి వెళ్లింది. 

పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులను ఆశ్రయంచింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తెలంగాణ ప్రజలు అలర్ట్.. నేడు పలుచోట్ల భారీ వర్షాలు.. మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు..

మూడోసారి ఆడపిల్ల పుట్టిందని...
వాంకిడి :  ఆడపిల్ల పుట్టిందన్న కోసం ఆ తండ్రిని విచక్షణ కోల్పోయేలా చేసింది. పసిగుడ్డు అని కూడా చూడకుంగా కర్కోటకుడిలా మారేలా చేసింది. అప్పుడే కళ్లు తెరిచిన లోకం పోకడ తెలియని చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండేలా చేసింది. తన తప్పేం ఉందో కూడా తెలియని ఆ చిన్నారి అమానుషంగా బలైపోయింది. 

చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణ మృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను  మద్యం మత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం నింపింది.  

ముందు ఇద్దరూ girl child ఉండడంతో మూడోసారైనా అబ్బాయి పుడతాడని ఓ తండ్రి ఆశపడ్డాడు. కానీ అతని ఆశ నిరాశ చేస్తూ..మూడో సంతానం కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో ఓ తండ్రి కసాయిగా మారాడు. 

new born babyని నిర్ధాక్షిణ్యంగా నేలకు కొట్టి బలి తీసుకున్న హృదయవిదారక సంఘటన కొమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన  లైన్ గూడ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

కాగజ్ నగర్  గ్రామీణ  ఎస్ ఐ రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం…  కాగజ్ నగర్ మండలంలోని  లైన్ గూడా పంచాయతీ కేంద్రానికి చెందిన  గిరిజన దంపతులు  బాపురావు- మనీషాలకు ఇద్దరు ఆడపిల్లలు  మౌనిక (5),  అశ్విని (3)  ఉన్నారు.  45 రోజుల కిందట Third childగా ఆడపిల్ల జన్మించింది.

ఆడపిల్ల పుట్టిందని అప్పటినుంచి బాపురావు రోజూ liquor తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.  సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక, అశ్విని టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లారు. ఇంట్లో  మనీషా తో పాటు  చిన్నారి ఉంది.  భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu