బీజేపీకి రాజీనామా చేస్తా: రేపు పార్టీకి లేఖ పంపుతా

By narsimha lodeFirst Published Feb 7, 2024, 2:25 PM IST
Highlights

మాజీ మంత్రి బాబు మోహన్  బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ తనను దూరం పెడుతుందన్నారు.   
 


హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి  మాజీ మంత్రి బాబు మోహన్  బుధవారం నాడు రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. పార్టీ పెద్దలకు  రాజీనామా లేఖను రేపు పంపుతానని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నుండి తనను పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

also read:నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్

బుధవారంనాడు హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు.బీజేపీ  కోసం తాను చాలా కష్టపడినట్టుగా ఆయన గుర్తు చేశారు.తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.పార్టీ నేతలు కొందరు తనను అవమానించారని ఆరోపించారు.ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.

also read:బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి:ఎంపీ పదవికి వెంకటేష్ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల నాటినుండి తనను  దూరం పెడుతూ తన ఫోన్ సైతం తీయడం లేదన్నారు.ఆందోల్ నియోజకవర్గం నుండి 2018, 2023లో బిజెపి అభ్యర్ధిగా  బాబు మోహన్ పోటీ చేశారు. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో 2404 ఓట్లు,  2023 అసెంబ్లీ 5,524  ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరంగల్ ఎంపీ టికెట్  ను బాబు మోహన్ అడుగుతున్నారని సమాచారం. వరంగల్ టికెట్ బాబు మోహన్ కు ఇచ్చేందుకు  బీజేపీ నాయకత్వం సానుకూలంగా లేదనే సమాచారం. 

also read:తెలంగాణఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల:మే 9 నుండి 12 వరకు పరీక్షలు

దీంతో బీజేపీ కి బాబు మోహన్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు.2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో   చివరి నిమిషం లో ఆందోల్ టికెట్ ను బాబుమోహన్ కు  ఆ పార్టీ కేటాయించింది.

click me!