రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతాననడం అహంకారమే - బండి సంజయ్..

Published : Feb 07, 2024, 01:01 PM IST
రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతాననడం అహంకారమే - బండి సంజయ్..

సారాంశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)ని చెప్పుతో కొడతానని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former Chennur MLA Balka Suman) చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Karimnagar MP and BJP national general secretary Bandi Sanjay) అన్నారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు భాషను మార్చుకోవాలని సూచించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. హుజారాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని బాల్క సుమన్ అనడం సరైంది కాదని అన్నారు. ఇంతకన్నా సిగ్గు చేటైన పని ఇంకోటి లేదని అన్నారు.

మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ

బాల్క సుమన్ మాటలు పూర్తి అహంకారపూరితమైనవే అని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కుటుంబంతో పాటు ఆ పార్టీ నాయకుల అహకారం బయటకు వస్తోందని ఆరోపించారు. దీనిని అందరూ ఖండిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు భాష మార్చుకోవల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలను ఇబ్బందులు పడుతున్నప్పుడు విమర్శలు చేయాలని అన్నారు. కానీ చెప్పుతో కొడతా అంటూ వ్యక్తిగత దూషణలుకు దిగడం కరెక్ట్ కాదని తెలిపారు. 

తారు డ్రమ్ములో ఇరుక్కుపోయిన కూలీ.. మూడు రోజులు నరకం.. లోపలికి ఎందుకు వెళ్లాడబ్బా.. ? (వీడియో)

బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  తీవ్రంగా మండిపడ్డారు. సుమన్‌కు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు గుణపాఠం చెబుతారని చెప్పారు. సుమన్‌ సెక్స్‌ కుంభకోణాలకు పాల్పడ్డారని తమకు తెలుసని, త్వరలోనే వాటిని పార్టీ బయటపెడుతుందని ఆయన ఆరోపించారు. కాగా.. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకీ బాల్క సుమన్ ఏమన్నారంటే.. ? 

ఆదిలాబాద్ లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో బాల్క సుమన్ హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో తన కాలి చెప్పును తీసి చూపిస్తూ.. రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు.. హౌలేగాడు అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని, కానీ సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్