మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కరోనా: ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక

By narsimha lodeFirst Published Sep 30, 2020, 10:36 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం  నాడు చేరారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం  నాడు చేరారు.

ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని నాయిని నర్సింహారెడ్డి  సూచించారు. అంతేకాదు క్వారంటైన్ లోకి వెళ్లాలని కూడ ఆయన సూచించారు. ప్రస్తుతం ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పలువురు పార్టీ నేతలకు కరోనా సోకింది. కరోనా సోకిన వారంతా చికిత్స తీసుకొని కోలుకొన్నారు. మంత్రి హరీష్ రావుకు ఇటీవలనే కరోనా సోకింది.కరోనా నుండి ఆయన కోలుకొని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బుధవారం నాటికి 1,91,386కి కరోనా కేసులు చేరుకొన్నాయి.  కరోనా నుండి ఇప్పటివరకు 1,60,933 మంది కోలుకొన్నారు.

కరోనాతో రాష్ట్రంలో 1127 మంది మరణించారు.  రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,326 ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

click me!