హ్యాట్రిక్... తెలంగాణను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డ్

By Arun Kumar PFirst Published Sep 30, 2020, 10:17 AM IST
Highlights

స్వచ్చ భారత్ ను పక్కాగా అమలుచేయడంలో రాష్ట్రాలు, జిల్లాల మద్య పోటీతత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రత్యేక అవార్డులను అందిస్తోంది. ఈ విషయంలో  గత రెండేళ్లుగా తెలంగాణ మొదటిస్థానాన్ని దక్కించుకోగా తాజాగా మూడోసారి కూడా ఆ అవార్డును దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చ భారత్ ను పక్కాగా అమలుచేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్రం పేర్కొంది. అందువల్ల రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ మొదటిస్థానాన్ని దక్కించుకుందని కేంద్రం ప్రకటించింది. వరుసగా మూడో సారి స్వచ్చ భారత్ విషయంలో మొదటిస్థానంలో నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. 

స్వచ్చ భారత్ ను పక్కాగా అమలుచేయడంలో రాష్ట్రాలు, జిల్లాల మద్య పోటీతత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రత్యేక అవార్డులను అందిస్తోంది. ఈ విషయంలో  గత రెండేళ్లుగా తెలంగాణ మొదటిస్థానాన్ని దక్కించుకోగా తాజాగా మూడోసారి కూడా ఆ అవార్డును దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. మరోసారి తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పనిచేసి దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర పారిశుద్ధ్య, తాగునీటి విభాగ(డీడీడబ్ల్యూఎస్‌) డైరెక్టర్‌ యుగుల్‌ కిషోర్‌ జోషి  తెలిపారు. ఈ మేరకు ఆయన  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు మంగళవారం ఓ లేఖ రాశారు. 

read more   హరితహరంతో నే వానలు బాగా కురుస్తున్నాయి మంత్రి గంగుల కమలాకర్

ఇక మూడోసారి కూడా స్వచ్చభారత్ అవార్డు రాష్ట్రానికే వరించడంపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్ల దయాకరరావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా జరిగేలా చూడటం వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు. 

అక్టోబర్ 2న స్వచ్చభారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం అందజేయనుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అవార్డులను అందజేయనున్నారు. 
 

click me!