తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఇటీవల కాస్త తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,103 పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. అయితే ఇప్పటికే కరోనాబారిన పడినవారిలో 2,243 మంది కోలుకున్నారని వెల్లడించారు.
తాజాగా నిర్దారణ అయిన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,91,386 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇందులో 1,60,933 మంది ఇప్పటికే ఈ వైరస్ బారినుండి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29,326 గా వుంది.
undefined
read more తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... అయినా ఊరటనిచ్చే అంశమేంటంటే
ఇక గత 24గంటల్లో కరోనా కారణంగా 11మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1127కు చేరింది. అలాగే జాతీయస్థాయి మరణాలు రేటు 1.56శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 0.58శాతంగా వున్నట్లు వెల్లడించారు. రికవరీ రేటు జాతీయస్థాయిలో 83.27శాతంగా వుంటే రాష్ట్రంలో అది ఏకంగా 84.08శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 298, భద్రాద్రి కొత్తగూడెంలో 102, కరీంనగర్ లో 103, ఖమ్మంలో 93, మేడ్చల్ లో 176, నల్గొండలో 141, రంగారెడ్డిలో 172, సంగారెడ్డిలో 63, సిద్దిపేటలో 92, వరంగల్ అర్బన్ లో 85, సూర్యాపేటలో 51, నిజామాబాద్ లో 57 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో తక్కువగానే కేసులు నమోదయ్యాయి.