ఆ రెండు సీట్లలో వేరేవారికి టిక్కెట్ల కేటాయింపు: అసంతృప్తిలో దామోదర, కీలక నిర్ణయానికి చాన్స్

By narsimha lode  |  First Published Nov 7, 2023, 10:46 AM IST

తెలంగాణలో  అధికారంలోకి రావాలని  భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి  టిక్కెట్ల కేటాయింపు  తలనొప్పిగా మారింది. తాము ప్రతిపాదించిన అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయించలేదని కొందరు సీనియర్లు  రేవంత్ రెడ్డి తీరుపై  మండిపడుతున్నారు.



హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని  నారాయణఖేడ్,  పటాన్ చెరులలో  సీట్ల కేటాయింపు విషయమై  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై  దామోదర రాజనర్సింహ చర్చిస్తున్నారు.  రెండు మూడు రోజుల్లో  కీలక నిర్ణయం తీసుకుంటానని రాజనర్సింహ చెబుతున్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలోని  నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి,  పటాన్ చెరు నుండి  శ్రీనివాస్ గౌడ్ కు  టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు  టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో  దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా  వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. 

Latest Videos

undefined

నారాయణఖేడ్ నుండి సురేష్ కుమార్,  పటాన్ చెరు నుండి నీలం మధులకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. సోమవారంనాడు రాత్రి  కాంగ్రెస్ పార్టీ  మూడో జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో  నారాయణఖేడ్, పటాన్ చెరు అసెంబ్లీ స్థానాలకు చోటు దక్కింది.  ఈ జాబితాలో తాను సూచించిన అభ్యర్ధులు కాకుండా  వేరే వాళ్లకు  కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్లు కేటాయించడంతో దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై  దామోదర రాజనర్సింహ అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టిక్కెట్లు కేటాయించాలని  దామోదర రాజనర్సింహ పార్టీ నాయకత్వానికి సూచించారు. తాను సూచించిన వారికి టిక్కెట్లు దక్కకపోవడంతో  దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పార్టీకి దామోదర రాజనర్సింహ గుడ్ బై చెబుతారా అనే  చర్చ కూడ సాగుతుంది. అయితే  రెండు మూడు రోజుల్లో  తన నిర్ణయాన్ని చెబుతానని  దామోదర రాజనర్సింహ అనుచరులకు తేల్చి చెప్పారు. దామోదర రాజనర్సింహ ఏ నిర్ణయం తీసుకొంటారననేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

also read:కేసీఆర్ పై పోటీకి రేవంత్ సై.. తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల మూడో జాబితా విడుద‌ల

నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుండి సంజీవరెడ్డి బలమైన అభ్యర్ధి అని  దామోదర రాజనర్సింహ చెబుతున్నారు. సంజీవరెడ్డికి బదులుగా  సురేష్ కుమార్ ను బరిలోకి దింపడం వల్ల ప్రయోజనం ఉండదని రాజనర్సింహ వర్గం వాదిస్తుంది.బీఆర్ఎస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం చేసినందున ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని  కాంగ్రెస్ నాయకత్వం చెబుతుంది.బీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కని  నీలం మధును  పార్టీలో చేర్చుకొని  పటాన్ చెరు టిక్కెట్టు కట్టబెట్టడంపై  దామోదర రాజనర్సింహ వర్గం మండిపడుతుంది.  ఈ విషయమై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై   దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!