
మహాబూబ్‌నగర్: స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను పోలీసులు, కోర్టులు కూడ కాపాడలేకపోతున్నాయని మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ అభిప్రాయపడ్డారు.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యుడిగా ఉన్నారు.
Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: ముగ్గురితో సుప్రీం కమిటీ
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కడ్తాల్‌కు సమీపంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద ధ్యాన మహా చక్రంలో కార్తికేయన్ పాల్గొన్నారు. ధ్యాన మహా చక్రంలో పాల్గొన్న సీబీఐ మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read:దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు
భారత్‌లో స్త్రీలను దేవతలుగా పూజిస్తామని అలాంటి దేశంలో స్త్రీలపై అత్యాచారాలు, దాడులు చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు సిగ్గుచేటని ఆయన చెప్పారు.
Also read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ నెల 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పుర్కార్ ఛైర్మెన్‌గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు చెప్పింది.
Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్
ఈ కమిటీ ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ కమిటీ ఇంకా కూడ విచారణకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించలేదు. ఈ కేసు విచారణ కోసం ఈ నెలాఖరులో కమిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే
అయితే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కూడ కార్తికేయన్ ఆదివారం నాడు కూడ కడ్తాల్ లో ఉంటారు.