దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు

By narsimha lode  |  First Published Dec 22, 2019, 8:58 AM IST

దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టు మార్టం కోసం ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ బృందం రానుంది. 


హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.

Also read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Latest Videos

undefined

దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.

Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్

ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.

Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. 

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది. 
 

click me!