అసహజ శృంగారం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు - తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు

Published : Jun 11, 2023, 07:36 AM IST
అసహజ శృంగారం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు - తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు

సారాంశం

తెలంగాణ క్యాడర్ కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అసహజ శృంగారం కోసం బలవంతం చేస్తున్నారని, అలాగే గృహహింసకు పాల్పడుతున్నారని ఆమె కోర్టును ఆశ్రయించారు. 

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, అలాగే గృహహింసకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించారు. 

మహబూబాబాద్ లోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. రూ. 2 కోట్ల విలువైన యంత్రాలు, 15 వేల క్వింటాళ్ల ధాన్యం దహనం

‘ఈనాడు’ కథనం ప్రకారం..  ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సందీప్‌ కుమార్‌ ఝాపై ఆయన భార్య ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ తనపై గృహహింసకు పాల్పడుతున్నారని, అలాగే అసహజ శృంగారానికి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు.

విషాదం.. తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 85 ఏళ్ల వృద్ధుడు మృతి..

2021లో సందీప్ కుమార్ ఝాతో తనకు వివాహం జరిగిందని ఆమె చెప్పారు. అయితే ఆ సమయంలో రూ.1 కోటి ఖర్చు చేసి వివాహం చేశారని ఆమె అన్నారు. కానీ ఇంకా బంగారం, నగలు తీసుకురావాలని అతడు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. వివాహానికి ముందు, అలాగే వివాహం అయిన తరువాత కూడా  కట్నం కోసం హింసకు గురి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాలో తాను కోర్బా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కానీ తన భర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. అందుకే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు.

గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

అయితే ఐఏఎస్ ఆఫీసర్ భార్య పిటిషన్ ను కోర్టు విచారించింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. కాగా.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఆఫీసర్ సందీప్‌ కుమార్‌ ఝా 2014 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆ ఆఫీసర్ బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్‌ సెక్రటరీ గా పని చేస్తున్న ఆయనకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కోర్బా ప్రాంతానికి చెందిన మహిళతో 2021లో వివాహం జరిగింది.

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu