కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులు అస్వస్థత

Published : Mar 09, 2023, 03:25 PM IST
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులు అస్వస్థత

సారాంశం

Mahabubabad: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

Food Poison at Mahabubabad KGBV: మహబూబాబాద్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థుల‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బుధ‌వారం రాత్రి భోజనానికి తయారు చేసిన టమోటా వంటకం తిన‌డం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు, సంబంధిత విద్యాలయం వర్గాలు తెలిపాయి. 

కాగా, ఈ ఘ‌ట‌న‌పై జిల్లా విద్యాశాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మై విద్యార్థుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా కలెక్టర్, డీఈవోతో ఫోన్ లో  మాట్లాడి మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కేజీబీవీ అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu