హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువకులు.. అడ్డుకోవడానికి యత్నించిన వ్యక్తిపై కూడా దాడి..

Published : Sep 17, 2022, 03:21 PM IST
హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువకులు.. అడ్డుకోవడానికి యత్నించిన వ్యక్తిపై కూడా దాడి..

సారాంశం

హైదరాబాద్‌ ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. దీనిని అడ్డుకోవడానికి చూసిన మరో డెలివరీ బాయ్‌పై యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సరూర్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌ ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. దీనిని అడ్డుకోవడానికి చూసిన మరో డెలివరీ బాయ్‌పై యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సరూర్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక భవానీనగర్ చౌరస్తాలో ఫుడ్ డెలివరీ బాయ్ కిరణ్‌పై కొందరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. దాడిని అడ్డుకునేందకు మరో డెలివరీ బాయ్ ప్రవీణ్ యత్నించాడు. అయితే నిందితులు ప్రవీణ్‌పై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో కిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటన తర్వాత పారిపోతున్న నిందితులను కొందరు డెలివరీ బాయ్స్ వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక, నిందితుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చినవారు ఉన్నారని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?