సాగర్ రింగ్ రోడ్ లో కుప్పకూలిన ఫ్లై ఓవర్.. పదిమందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం...(వీడియో)

By SumaBala Bukka  |  First Published Jun 21, 2023, 6:26 AM IST

ఎల్బీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలడంతో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. 


హైదరాబాద్ : హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.  ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలి పది మందికి గాయాలు అయ్యాయి.  మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో అది తాకడంతో ఒక్క సారిగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. బైరామల్ గూడా ఫ్లై ఓవర్ ర్యాంప్ కూలింది. రెండు పిల్లర్ల మధ్య ఉన్న ర్యాంప్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్మికులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రాణాపాయం జరగలేదు. 

Latest Videos

పైనున్న ఫ్లైఓవర్ సీకులు గుచ్చుకుంటే పెను విషాదం చోటు చేసుకునేది. రాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది. 

ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ కమీషనర్ సందర్శించారు. ఘటన దురదృష్టకరం అన్నారు. దీనికి కాంట్రాక్టర్ వైఫల్యమా..లేక కారణమేంటో ఆరా తీస్తాం అన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు. ఘటన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 

click me!