మళ్లీ వేధిస్తున్నాడు.. తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

Siva Kodati |  
Published : Jun 20, 2023, 10:09 PM ISTUpdated : Jun 20, 2023, 10:20 PM IST
మళ్లీ వేధిస్తున్నాడు.. తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

సారాంశం

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతిరోజూ వేధిస్తున్నాడని నవ్య వాపోయారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజయ్యపై తాను చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారని నవ్య ఆరోపించారు. తనకు, తన భర్తకు మధ్య చిచ్చుపెట్టాలని రాజయ్య చూస్తున్నారని.. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. రూ.20 లక్షలు ఇస్తానని.. రాజీ చేసుకోవాలని కొందరితో ఒత్తిడి చేస్తున్నారని నవ్య ఆరోపించారు. అలాగే గతంలో తాను ఆరోపణలు అవాస్తవమని బాండ్ రాసివ్వాలని బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

గతంలో గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నవ్య తెలిపారు. తన భర్తను ఓ మహిళా ప్రజాప్రతినిధితో ట్రాప్ చేయిస్తున్నారని  ఆమె ఆరోపించారు. రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతిరోజూ వేధిస్తున్నాడని నవ్య వాపోయారు. ఎమ్మెల్యేపై ఆరోపణల తర్వాత తనకు సరైన గౌరవం దక్కడం లేదని.. వెలివేసినట్లుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నవ్య వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

ALso Read: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు: విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

కాగా.. ఈ ఏడాది మార్చిలో రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నవ్య. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని.. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తనపై కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అంటున్నారనంటూ నవ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో స్వయంగా రాజయ్య ఆమె ఇంటికి వెళ్లి వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్