నయీంతో అంటకాగిన పోలీసులపై వేటు

First Published May 11, 2017, 1:44 PM IST
Highlights

పక్కా సాక్షాధారాలు సేకరించిన తర్వాతే పోలీసులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగిన పోలీసులపై వేటు పడింది. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులపై వేటు వేసింది.

 

 సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ నయీంతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు కూడా లభించాయి.

 

పక్కా సాక్షాధారాలు సేకరించిన తర్వాతే పోలీసులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు.

click me!