పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో.. ఐదుగురి అరెస్ట్..

Published : Nov 29, 2022, 02:09 PM IST
పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో.. ఐదుగురి అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్ లో సంచలనం రేపిన పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : హయత్ నగర్ లో పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువకులంతా ఒకే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒకే తరగతి కావడంతో విద్యార్థిని యువకులతో సన్నిహితంగా ఉంది. ఇదే అదనుగా భావించి నిందితులు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థిని మీద నాలుగు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్లలో వీడియో ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హయత్‌నగర్ మండలంలోని తట్టి అన్నారంలో టెన్త్  క్లాస్ విద్యార్ధినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే పదో తరగతి విద్యార్ధినిపై సహచర విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో రికార్డు చేశారు. ఈ వీడియోలను తోటి విద్యార్ధులకు షేర్  చేశారు. ఈ  విషయం బయటకు చెబితే రేప్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని నిందితులు బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు.

నాన్నపై ప్రేమతో... తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య...

పదో తరగతి విద్యార్ధినిపై నాలుగు నెలలుగా నిందితులు అత్యాచారానికి పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. తొలుత ఓ విద్యార్ధి బాధితురాలి న్యూడ్ ఫోటోలు తీశాడు. ఈ ఫోటోలు చూపించి మొదట ముగ్గురు విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఒకరు వీడియో తీశారు. ఈ వీడియోను 20 మంది విద్యార్ధులకు షేర్  చేశారు. ఈ వీడియోను చూపి పలువురు విద్యార్ధులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ  ఏడాది ఆగస్టు మాసంలోనే విద్యార్ధినిపై  అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుండి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న