హైద్రాబాద్ ముత్తంగి వద్ద దారిదోపీడీ: ఫ్లిఫ్ కార్ట్ సామాగ్రిని దోచుకున్న దుండగులు

Published : Mar 13, 2023, 09:29 PM ISTUpdated : Mar 13, 2023, 09:42 PM IST
హైద్రాబాద్ ముత్తంగి వద్ద  దారిదోపీడీ: ఫ్లిఫ్ కార్ట్  సామాగ్రిని  దోచుకున్న దుండగులు

సారాంశం

హైద్రాబాద్ ముత్తంగి  వద్ద  ఫ్లిప్ కార్ట్ సామానుతో  వెళ్తున్న  లారీని  దుండగులు  అడ్డగించి దోచుకున్నారు. . 

హైదరాబాద్: హైద్రాబాద్  కు సమీపంలోని ముత్తంగి  వద్ద  ఫ్లిఫ్ కార్ట్  సామాగ్రి  తీసుకెళ్తున్న లారీని  సోమవారంనాడు  దోచుకున్నారు దోపీడీ దొంగల ముఠా.  లారీని  ఔటర్ రింగ్  రోడ్డు  నుండి  కాకుండా  సర్వీస్ రోడ్డులోకి  మళ్లించి  దుండగులు  దోచుకున్నారు.  ఐదుగురు సభ్యులున్న ముఠా  సభ్యులు  లారీ డ్రైవర్ ను తుపాకీతో బెదిరించారు. లారీలో  ఉన్న  సామాగ్రిని  దుండగులు దోచుకున్నారు.  ఈ ఘటనకు  సంబంధించి  బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.ఈ ఫిర్యాదుపై  పోలీసులు కేసు నమోదు  చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నారు.

గతంలో  కూడ ఇదే తరహలో  దోపీడీలు  జరిగిన  ఘటనలు  తెలుగు రాష్ట్రాల్లో  చోటు  చేసుకున్నాయి. 
హైద్రాబాద్ మైలార్ దేవ్ పల్లి వద్ద  లారీ డ్రైవర్, క్లీనర్ ను బెదిరించి లారీలోని సరుకును దుండగులు దోచుకున్నారు.ఈ లారీలో  రూ. 37 లక్షల సరుకును దోచుకున్నారు. ఈ ఘటన  2022  ఫిబ్రవరి  17న చోటు  చేసుకుంది.   లారీలోని  టైర్లను  సమీపంలోని గోడౌన్ లో  దింపి  లారీని  శ్రీళైలం  రోడ్డుపై తీసుకెళ్లి దుండగులు వదిలివెళ్లారు.

మరో వైపు  సెల్ ఫోన్లను  తరలిస్తున్న  లారీలను  అడ్డగించి  లక్షల విలువైన  సెల్ ఫోన్లను దుండగులు దోచుకున్న ఘటనలు  కూడా   ఏపీ రాష్ట్రంలో  నమోదయ్యాయి.  గుంటూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో  ఈ తరహ కేసులు  నమోదయ్యాయి.ఈ రెండు  ఘటనల్లో  నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bandi Sanjay Reaction About Akhanda2 : అఖండ 2 సినిమా చూసి బండి సంజయ్ రియాక్షన్| Asianet News Telugu
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu