ఉస్మానియాలో ఇద్దరు రోగుల మృతి: మృతులకు కోవిడ్ పాజిటివ్

By narsimha lode  |  First Published Dec 26, 2023, 12:56 PM IST


తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు రోగులు మృతి చెందాడు. మృతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  ఉస్మానియా ఆసుపత్రిలో  ఇద్దరు రోగులు మృతి చెందాడు. శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో చేరిన ఇద్దరు రోగులు మృతి చెందారు.  పరీక్షల సమయంలో మృతులకు కరోనా పాజిటిావ్ గా నిర్ధారణ అయిందని ఉస్మానియా వైద్యులు ప్రకటించారు.  ఉస్మానియా ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఇద్దరు రోగులు మృతి చెందారు.

రెండు మూడు రోజుల వ్యవధిలోనే  ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  60 ఏళ్ల  వయస్సున్న రోగి, 42 ఏళ్ల వయస్సున్న మరొకరు మృతి చెందారు. వీరికి  ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయి.ఈ సమస్యలతో పాటు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

Latest Videos

మరణించిన వారికి కరోనా పాజిటివ్ తో పాటు ఇతరత్రా సమస్యలున్నందున మరణించినట్టుగా వైద్యులు చెబుతున్నారు.  మరణానికి కరోనాతో పాటు ఇతర అంశాలు కూడ  కారణమనే అభిప్రాయాలను వైద్యశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.శ్వాసకోశ సమస్యలుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో  రోగులు  మృతి చెందారని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి. దీంతో   తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఉస్మానియా ఆసుపత్రిలో  ఇద్దరు పీజీ వైద్యులకు  కూడ కరోనా సోకింది. మరో ముగ్గురు కరోనా పాజిటివ్ సోకిన రోగులకు ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. 

also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?

. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో  కొత్తగా  4 కరోనా కేసులు నమోదయ్యాయి.   ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో  నలుగురికి కరోనా సోకింది.  వీరి శాంపిల్స్ ను పుణెకు పంపారు.  

also read:మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా: ఐసోలేషన్‌లో మినిస్టర్

తెలంగాణ రాష్ట్రంలో  గతంలో నమోదైన కేసులతో కలిపితే  మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,44,558కి చేరింది.  కరోనా నుండి రికవరీ కేసుల సంఖ్య  8,40,392కి చేరింది. గత 24 గంటల్లో  ఒకరు కరోనా నుండి కోలుకున్నారు.  తెలంగాణలో  కరోనా రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది.  

also read:ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా యాక్టివ్ కేసులు 55 నమోదయ్యాయి.  కరోనా యాక్టివ్ కేసుల్లో  హైద్రాబాద్ లోనే  45 ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో కరోనా జేఎన్.1 వేరియంట్ కేసులు రెండు నమోదైనట్టుగా  వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  గాను  అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా   వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. కరోనా పరీక్షలను కూడ పెంచుతున్నామని  వైద్యశాఖాధికారులు తెలిపారు.

ఇప్పటికే  రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కరోనా కేసులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.  కరోనా జేఎన్. 1 వేరియంట్ పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ప్రకటించింది. అయితే  అదే సమయంలో కరోనా విషయంలో నిర్లక్ష్యం కూడ పనికి రాదని వైద్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు.  తరచుగా  చేతులు శుభ్రపర్చుకోవడంతో పాటు  మాస్కులు ధరించాలని  వైద్య శాఖ నిపుణులు  ప్రజలను కోరుతున్నారు. 

click me!