తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు (new ration cards applications) స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కొనసాగే ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో వీటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
telangana ration cards : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ నుంచి చేపడుతున్న ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రెండు గ్యారెంటీల్లో అమలు చేశామని చెప్పారు. మిగిలినవి కూడా త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. వాటి కోసం ఇప్పటికే కార్యచరణ కూడా రూపొందించామని స్పష్టం చేశారు.
జనవరి 6వ తేదీ వరకు సాగే గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. ఇందులో కేవలం 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళల కోసం స్పెషల్ లైన్స్ ఉంటాయని స్పష్టం చేశారు.
కేంద్రం అలా... రాష్ట్రం ఇలా : తెలంగాణలో కరోనా న్యూ వేరియంట్ గందరగోళం
కాగా.. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు. అందులో పేదలందరి నుంచి తెల్ల రేషన్ కార్డుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్ఫష్టం చేశారు.
ప్రజా భవన్ ముందు కారు బీభత్సం... ఇది బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు పనేనా?
‘‘డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలోని పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం. ప్రతీ కార్యకర్త, ప్రతి జిల్లా అధ్యక్షుడు, ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రతీ ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి బాగా పని చేస్తున్నారు.’’ అని హన్మంతరావు తెలిపారు.
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కేసులో కీలక పరిణామం.. మరో ముగ్గురి అరెస్టు..
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కె కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడవచ్చని తెలిపారు. కానీ సీఎం సిద్దరామయ్య ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే నిషేధాన్ని ఎత్తివేస్తారని హన్మంత రావు ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం ఏది చెబితే అది అమలు చేస్తారని స్పష్టం చేశారు.