తెలంగాణ అసెంబ్లీ గేట్-1 వద్ద కారులో మంటలు..

Published : Mar 12, 2022, 02:08 PM ISTUpdated : Mar 12, 2022, 02:23 PM IST
తెలంగాణ అసెంబ్లీ గేట్-1 వద్ద కారులో మంటలు..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ గేట్-1 వద్ద కారులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో... అప్రమత్తమైన కారులోని వ్యక్తి వెంటనే కిందకు దిగిపోయాడు.

తెలంగాణ అసెంబ్లీ గేట్-1 వద్ద కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని వ్యక్తి వెంటనే కిందకు దిగిపోయాడు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పింది. దీంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇక, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అక్కడి పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కారులో మంటలు చెలరేగిన  వెంటనే సమీపంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని కారు పూర్తిగా దగ్దం కాకముందే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కారును అక్కడి నుంచి తరలించారు.కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు