హైద్రాబాద్ మహేశ్వరం గోడౌన్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 26, 2023, 03:50 PM ISTUpdated : Feb 26, 2023, 04:13 PM IST
హైద్రాబాద్ మహేశ్వరం గోడౌన్ లో  అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్  కు సమీపంలోని మహేశ్వరం  పారిశ్రామికవాడ గోడౌన్ లో అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  

హైద్రాబాద్  నగరంలో  పలు ప్రాంతాల్లో   ఇటీవల కాలంలో  అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.హైద్రాబాద్  ఎర్రగడ్డ  రాజ్ మినరల్ వర్క్స్ గోడౌన్ లో రెండు రోజుల క్రితం  అగ్ని ప్రమాదం  జరిగింది.ఈ అగ్ని ప్రమాదం కారణంగా  ఎర్రగడ్డ ప్రాంతంలో  ట్రాఫిక్ జాం అయింది.  జనావాసాల మధ్యే  ఈ గోడౌన్ ఉంది. సికింద్రాబాద్  బోయిన్ పల్లి మార్కెట్ లోని  దుకాణంలో  ఈ నెల  22న  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  ఫైరింజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఈ నెల  7వ తేదీన  హైద్రాబాద్ మైలార్ దేవ్ పల్లి టాటానగర్  కార్ల షెడ్ లో  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఫైరింజ్లు మంటలను ఆర్పాయి.  ఈ నెల  15న  హైద్రాబాద్  పురానాపూల్ లో గల  ఎయిర్ కూలర్ల గోడౌన్లో  అగ్ని ప్రమాదం జరిగింది.  

also read:తప్పిన ప్రమాదం: సూర్యాపేట జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు

ఈ గోడౌన్ పక్కనే  ఫర్నీచర్ గోడౌన్ ఉంది. రెండు గోడౌన్లలో మంటలు చెలరేగాయి.  హైద్రాబాద్ పాతబస్తీ  ఆజంపురాలో  టైర్ల దుకాణంలో ఈ నెల  19న  అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఏడాది జనవరి 19వ తేదీన  సికింద్రాబాద్  రాంగోపాల్ పేట  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.  ఈనెల  8వ తేదీన  సంగారెడ్డి  జిన్నారం  మండలం  గడ్డపోతారం  పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం  జరిగింది.  లియో ఫార్మా పరిశ్రమలో  మంటలు చెలరేగాయి.  

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?