నవీన్ పేరేంట్స్ ‌కు క్షమాపణలు చెప్పిన హరిహరకృష్ణ తండ్రి

Published : Feb 26, 2023, 03:03 PM ISTUpdated : Feb 26, 2023, 03:22 PM IST
నవీన్ పేరేంట్స్ ‌కు  క్షమాపణలు చెప్పిన  హరిహరకృష్ణ తండ్రి

సారాంశం

నవీన్ ను తన కొడుకు   హరిహరకృష్ణ  హత్య  చేయడం తప్పేనని  తండ్రి ప్రభాకర్ చెబుతున్నారు.  ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దన్నారు.  

వరంగల్:  తన  కొడుకు నవీన్ ను హత్య  చేయడం తప్పేనని  హరిహరకృష్ణ తండ్రి  ప్రభాకర్ చెప్పారు.  ఈ తప్పిదం  చేసినందుకు  నవీన్ తల్లిదండ్రులను బహిరంగంగా క్షమాపణ కోరాడు  హరిహరకృష్ణ తండ్రి. హరిహరకృష్ణ తన కొడుకైనంత మాత్రాన అతను చేసిన తప్పును తాను సమర్ధించబోనన్నారు.  ఈ నెల  23వ తేదీన  తనకు  ఈ విషయం తెలిసిందన్నారు.

నవీన్ ను హత్య చేసే విషయంలో హరిహరకృష్ణకు  ఇతరులు ఎవరైనా సహయం చేసి ఉండొచ్చని  ప్రభాకర్ అనుమానం వ్యక్తం  చేశారు.  నవీన్, హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులని ఆయన  చెప్పారు. వీరిద్దరితో పాటు   యువతి కూడా వీరితో స్నేహంగా  ఉండేదన్నారు.  ఈ ముగ్గురు ఎప్పుడూ  కలిసే ఉండేవారన్నారు.  కానీ వీరిద్దరి మధ్య  గొడవకు  ఆ అమ్మాయే కారణమన్నారు. ఈ ఇద్దరిని  ఆ యువతి వాడుకుందని ఆయన అనుమానం వ్యక్తం  చేశారు. 

ఈ  నెల  17వ తేదీన  నవీన్ ను హరిహరకృష్ణ  దారుణంగా హత్య  చేశాడు. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు  చేసుకుంది.  ఈ నెల  24వ తేదీన   అబ్దుల్లాపూర్ పోలీసులకు హరిహరకృష్ణ పోలీసులకు  లొంగిపోయాడు.  హరిహరకృష్ణ లొంగిపోవడంతో  ఈ విషయం వెలుగు చూసింది. హరిహరకృష్ణ  తానే  నవీన్ ను హత్య  చేసినట్టుగా  పోలీసులకు చెప్పాడు.   నవీన్  శరీర బాగాలను   వేరు చేసి  వాటిని  ఫోటోలు తీసి  తన లవర్ కు  వాట్సాప్ లో  షేర్ చేశాడు. 

also read:నవీన్ హత్యకేసు: నిందితుడు హరిహర వాట్సాప్ పై పోలీసుల ఆరా

ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  ఈ విషయమై  హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించాలని  పోలీసులు బావిస్తున్నారు.  ఈ మేరకు కోర్టులో  పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు  చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్