చిలుక జోస్యాల గురించి తెలియదు: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమన్న రేవంత్

By narsimha lode  |  First Published Feb 15, 2023, 3:18 PM IST

కార్యకర్తల  మనోభావాలను దెబ్బతీసేలా  ఎవరూ మాట్లాడొద్దని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కోరారు.   
 


వరంగల్: వచ్చే ఎన్నికల్లో  తమ పార్టీని   ప్రజలు  బంపర్ మెజారిటీతో  గెలిపిస్తారని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెప్పారు.బుధవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  తమ పార్టీ గెలిచే పరిస్థితుల్లో  ఉన్నప్పుడు  ఇతర  పార్పొటీలతో పొత్తుల ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు .

కార్యకర్తల  మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడొద్దని  ఆయన  పార్టీ నేతలను కోరారు.  వచ్చే ఎన్నికల విషయంలో   సర్వేలు, చిలుక జోస్యాలు తనకు తెలియదన్నారు.. ఏసీ గదుల్లో  ఉండే కొందరి  వ్యాఖ్యలపై తమ దృష్టి ఉండదని రేవంత్ రెడ్డి  చెప్పారు.  

Latest Videos

undefined

ఎన్నికలు  ఎప్పుడొస్తాయో తెలియదన్నారు .అభ్యర్ధులెవరో  ఇప్పుడే తెలియదని రేవంత్ రెడ్డి  ప్రకటించారు.  పార్టీలో పరిణామాలను  అధిష్టానం పరిశీలిస్తూ ఉంటుందని  చెప్పారు.  సమయానుకూలంగా  అన్నింటికి పార్టీ పరిష్కారం చూపుతుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్ తో  పొత్తు ఉంటుందని భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి నిన్న న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను  కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తప్పుబట్టారు.  ఈ వ్యాఖ్యలు  పార్టీకి నష్టం కల్గించేలా  ఉన్నాయని పార్టీ  సీనియర్లు  అభిప్రాయపడ్డారు.  ఈ వ్యాఖ్యలు  చేసిన  కోమటిరెడ్డి వెంకంట్ రెడ్డిపై  చర్యలు తీసుకోవాలని  మల్లు రవి  డిమాండ్  చేశారు.

also read:పొత్తులపై నా వ్యాఖ్యలపై చర్చే లేదు: ఠాక్రేతో భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు.  తాను  నిన్న న్యూఢిల్లీలో  చేసిన వ్యాఖ్యలను ఠాక్రే చాలా లైట్ గా తీసుకున్నారని  చెప్పారు.ఈ వ్యాఖ్యలపై  అసలు చర్చే లేదన్నారు.  తనంటే  గిట్టని మీడియా తన  వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పు లేదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. 
 

 

click me!