హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలోని పాతబస్తీ ఆజంపురాలో వున్న ఓ టైర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆజంపురాలోని టైర్ల గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలావుండగా..గత వారం చాదర్‌ఘాట్‌లోనూ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. టైర్ల దుకాణానికి సంబంధించిన పాత గోడౌన్‌లో శనివారం మంటలు చెలరేగాయి.
ఇకపోతే.. అస్సాంలోని జోర్హాట్‌లో గురువారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 100కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అర్థరాత్రి ఒంటిగంట వరకు మంటలను ఆర్పే పని కొనసాగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ ప్రధాన గేటుకు సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. క్రమేపీ విస్తరిస్తూ రాత్రి 1 గంట వరకు దాదాపు 100 దుకాణాలు దగ్ధమైనట్లు సమాచారం.
ALso REad: అస్సాంలో ఘోర అగ్నిప్రమాదం..100కి పైగా దుకాణాలు దగ్ధం..
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. జోర్హాట్‌లోని AT రోడ్‌లో చౌక్ బజార్ ఉంది. ఇక్కడి ఓ బట్టల దుకాణంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి 100కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.