సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సాయన్న మరణవార్త తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతికి గురైన ముఖ్యమంత్రి.. అశోక్ నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సాయన్న పార్దీవదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. సాయన్నకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1951 మార్చి 5న సాయన్న జన్మించారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి సాయన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.టీడీపీ నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాయన్న బీఆర్ఎస్ లో చేరారు.
ALso REad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
1994లో టీడీపీ అభ్యర్ధిగా సాయన్న తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి నాలుగు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ప్రకటించిన టీటీడీ పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం నుండి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సాయన్నకు చోటు కల్పించారు. ఆయన మరణం పట్ల తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.