
హైదరాబాద్‌లోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగసిపడ్డాయి. భారీగా పొగ వ్యాపించడంతో అక్కడికి సమీపంలో ఉన్నవారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే భారీగా మంటలు ఎగసిపడుతుంటంతో.. పక్కనే ఉన్న బాబా నగర్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.