చీమలపాడులో మృతి చెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ ఢిమాండ్ తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి.
ఖమ్మం: కారేపల్లి మండలం చీమలపాడులో మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్ తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ముందు బుధవారంనాడు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశాయి పార్టీలు.
.ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్య సహాయం అందించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలని కోరారు.. ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న పలు పార్టీల నేతలు , కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో ఆందోళనకారులు మొండికేశారు. పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్ లలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
undefined
also read:బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టాలి: చీమలపాడు ఘటనపై బండి సంజయ్
వైరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఇవాళ కారేపల్లి మండలం చీమలపాడులో జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో మంటలు వ్యాపించినట్టుగా సమాచారం. గుడిసెలో ఉన్న సిలిండర్ మంటలకు పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగరురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.