సంగారెడ్డిలోని అగ్ని ప్రమాదం.. లియో ఫార్మా కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

Published : Feb 08, 2023, 11:09 AM ISTUpdated : Feb 08, 2023, 12:36 PM IST
సంగారెడ్డిలోని అగ్ని ప్రమాదం.. లియో ఫార్మా కంపెనీలో ఎగసిపడుతున్న మంటలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

సారాంశం

సంగారెడ్డిలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

సంగారెడ్డిలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లియో ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్న సమయంలోనే మరోవైపు నుంచి మంటలు విస్తరించాయి. 

అయితే ఫార్మా కంపెనీలో భారీగా  కెమికల్ నిల్వ ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో మరో రెండు ఫైరింజన్లను కూడా అక్కడికి రప్పించేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa