ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కేసీఆర్‌ సర్కార్ కు షాక్: డివిజన్ బెంచ్ ఆదేశాలపై విచారణకు హైకోర్టు నిరాకరణ

By narsimha lode  |  First Published Feb 8, 2023, 11:05 AM IST

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై విచారించేందుకు  సింగిల్ బెంచ్  నిరాకరించింది.   


హైదరాబాద్: కేసీఆర్ సర్కార్  కు  హైకోర్టులో  బుధవారం నాడు  చుక్కెదురైంది.  డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై విచారణకు సింగిల్ బెంచ్  నిరాకరించింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  సింగిల్ బెంచ్ ఆర్డర్  పై మూడు వారాల పాటు  స్టే   కోరుతూ  ఈ నెల  7వ తేదీన  తెలంగాణ ప్రభుత్వం  సింగిల్ బెంచ్  ముందు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  నిన్న మధ్యాహ్నం హైకోర్టు సింగిల్ బెంచ్  విచారణను ప్రారంభించింది.  ఈ పిటిషన్ పై విచారణకు  సీజే  అనుమతి తీసుకోవాలని  హైకోర్టు సింగిల్ బెంచ్ తెలిపింది.  ఇవాళ ఉదయం  సీజే ముందు  ఈ విషయాన్ని మెన్షన్ చేస్తామని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ పిటిషన్ పై ఇవాళ  విచారణ  ప్రారంభం కాగానే  తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక  వ్యాఖ్యలు  చేసింది.డివిజన్ బెంచ్  ఆదేశాలపై  విచారణకు  సింగిల్ బెంచ్ నిరాకరించింది.  

ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసును సీబీఐ విచారణకు  అప్పగిస్తూ  2022 డిసెంబర్  26న  తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను  2023  జనవరి  4వ తేదీన  తెలంగాణ ప్రభుత్వం  హైకోర్టు డివిజన్ బెంచ్ లో  సవాల్ చేసింది.  ఈ విషయమై  అన్ని వర్గాల వాదనలను  డివిజన్ బెంచ్ విన్నది.  ఈ నెల  6వ తేదీన  ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్  తీర్పును వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్ధించింది.  

Latest Videos

సీబీఐ విచారణకు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.   అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఈ ఆర్డర్ పై  సమయం ఇవ్వాలని అడ్వకేట్  జనరల్  తెలంగాణ  హైకోర్టు డివిజన్ బెంచ్ ను కోరారు.  కానీ  డివిజన్ బెంచ్  నిరాకరించింది. దీంతో  నిన్న  హైకోర్టు  సింగిల్ బెంచ్  లో  తెలంగాణ  సర్కార్  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను తాము విచారించబోమని  హైకోర్టు  సింగిల్ బెంచ్  తేల్చి చెప్పింది.  సుప్రీంకోర్టులోనే  ఈ విషయమై తేల్చుకోవాలని  తెలంగాణ సర్కార్ కు సూచించింది.  

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సింగిల్ బెంచ్ తీర్పు: సీజే అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు

2022 అక్టోబర్  26వ తేదీన  మొయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు ఎమ్మెల్యేలను  ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసేందుకు  ప్రయత్నించారని  కేసు నమోదైంది. ఈ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం  ఉందని  బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది.  
 

click me!