హైద్రాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగలు. మెడికల్ దుకాణం వద్దకు వెళ్లిన బాలికను ఓ మహిళ ట్రాప్ చేసింది. తక్కువ ధరకు మందులను ఇప్పిస్తానని చెప్పి బాలికను మహిళ తీసుకెళ్లింది. ఈ బాలికను నలుగురు వ్యక్తులకు ఆ మహిళ అప్పగించింది. గంజాయి తాగిన నలుగురు యువకులు గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడే ముందు బాలికకకు మద్యం తాగించారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు బాలికను వదిలిపెట్టారు. ఇంటికి వచ్చిన బాలిక పేరేంట్స్ కు ఈ విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.