81 ఏళ్ల నుమాయిష్ చరిత్రలోనే తొలిసారి మహా విషాదం

By sivanagaprasad kodatiFirst Published Jan 31, 2019, 10:32 AM IST
Highlights

హైదరాబాద్‌లో నాంపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకృతులను ప్రదర్శించడంతో పాటు విక్రయించడం జరుగుతోంది. 1938లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రొత్సాహంతో దీనిని ప్రారంభించారు.

హైదరాబాద్‌లో నాంపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకృతులను ప్రదర్శించడంతో పాటు విక్రయించడం జరుగుతోంది. 1938లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రొత్సాహంతో దీనిని ప్రారంభించారు.

అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు డిగ్రీ విద్యార్థులు స్థానికంగా దొరికే అరుదైన వస్తువులను, కళాకృతులను ప్రదర్శించాలనుకున్నారు. తొలుత హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్ వద్ద 100 స్టాళ్లతో ‘‘నుమాయిష్’’ పేరుతో ప్రదర్శనను ప్రారంభించారు.

తదనంతరం కాలంలో వేదికను నాంపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలించారు. తర్వాత నుమాయిష్ పేరును ‘‘అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన’’గా మార్చారు. అయితే 2009లో తిరిగి ‘‘నుమాయిష్’’గా మార్చారు.

చరిత్రను బట్టి చూస్తే నుమాయిష్ ప్రారంభమై 81 సంవత్సరాలు గడుస్తోంది. ఇన్నేళ్లలో లక్షలాది మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్నా ఏనాడూ అక్కడ చిన్న ప్రమాదం కూడా జరగలేదు. అయితే తొలిసారిగా బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

2500 స్టాల్స్‌తో ఏర్పాటైన నుమాయిష్‌లో సుమారు 3/4 వంతు స్టాల్స్ అగ్నికీలలకు ఆహుతయ్యాయి. బుధవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 20 ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లు, వందలాది మంది పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

నాంపల్లి నుమాయిష్ అగ్ని ప్రమాదం దృశ్యాలు

వదంతులు నమ్మెుద్దు, ప్రాణ నష్టం జరగలేదు: సీపీ అంజనీకుమార్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతి అయిన స్టాల్స్, తొక్కిసలాట వీడియో

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం: భయంతో పరుగులు, తొక్కిసలాట
 

click me!