తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ కూడా టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేస్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కూకట్ పల్లి నుంచి బరి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూకట్ పల్లి టికెట్ తనకు ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం.. ఆకస్మిక రాకెట్ల దాడిలో 400 మందికి పైగా మృతి
undefined
అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ టికెట్ ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే కూకట్ పల్లి టికెట్ స్థానం కోసం బండ్ల గణేష్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.. టర్కీ, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్ లో ప్రజల సంబరాలు.. వీడియోలు వైరల్
తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేసింది. అందులో భాగంగానే నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.