తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకం.. ఈసారి ఏకంగా రూ.30 లక్షలు..!  

Published : Oct 08, 2023, 06:53 AM IST
తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకం.. ఈసారి ఏకంగా రూ.30 లక్షలు..!  

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. ఎరుకల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. రూ.60కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. ట్రైకార్‌ ద్వారా సాధికారత పథకాన్ని అమలు చేయనున్నది.

మరో వారం పది రోజుల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ తో పాటు.. ప్రతిపక్ష బీజేపీ , కాంగ్రెస్ లు ఓటర్ దేవు ఆకట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీ హామీల వర్షాన్ని కురిపిస్తూ వస్తున్నారు. గతంలో కుటుంబాలకు ఆర్ధిక భరోసా నిస్తూ.. ఆర్థిక పథకాలను తీసుకవచ్చిన  తెలంగాణ సర్కార్  తాజా మరో నూతన పథకాన్ని అమలు చేయనున్నది. 

ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, యాదవ సోదరులకు గొర్రెల యూనిట్ల పంపిణీ, గంగపుత్రులకు చేప పిల్లల పంపిణీ, దళితుల కోసం దళిత బంధు, వెనుకబడిన కులాలు, చేతివృత్తులవారికి చేయూతనందించేందుకు బీసీ బంధు, ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఎరుకల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. అయితే.. ఈ పథకాన్ని ట్రైకార్‌ ద్వారా అమలు చేయనున్నది.

పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. పందుల పెంపకం, స్లాటర్‌ హౌస్‌, కోల్డ్‌ స్టోరేజీలకు, రవాణా, ఫోర్క్‌ రిటైల్‌ మార్కెట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ.30లక్షల వరకు అందించనున్నది. ఇందులో  50శాతం రాయితీ కాగా.. 40శాతం బ్యాంకు రుణం, మరో పదిశాతం 10శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ పని చేస్తుంది. ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ రాష్ట్రస్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షించనున్నది. .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్