కన్నకూతుళ్లపై తండ్రి లైంగికదాడి యత్నం.. అడ్డువచ్చిన భార్యను కొట్టి..

Published : Mar 21, 2022, 07:12 AM IST
కన్నకూతుళ్లపై తండ్రి లైంగికదాడి యత్నం.. అడ్డువచ్చిన భార్యను కొట్టి..

సారాంశం

ఓ కన్నతండ్రి అత్యంత నీచానికి ఒడిగట్టాడు. కన్నకూతుళ్లను అపురూపంగా చూసుకోవాల్సింది పోయి వారిమీదే కన్నేశాడు. అడ్డువచ్చిన భార్యను కొట్టి తరిమేశాడు. కూతుళ్లపై లైంగిక దాడికి యత్నించాడు.. చివరికి...

వనస్థలిపురం : మానవత్వం మంటగలిసింది. ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13,  పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వనస్థలిపురం ఓ కాలనీలో వీరు ఉంటున్నారు. అతను ఆటో డ్రైవర్. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.  

అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి.. ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళా వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చింది.

ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు . వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.  కుమార్తెల పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. 

ఇదిలా ఉండగా,  హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే మార్చి 18న వెలుగులోకి వచ్చింది. కన్న కూతురి మీద molestationకి పాల్పడిన fatherని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గురురవాం బోయిన్ పల్లి పీఎస్ లో బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. Mahabnagar Districtకు చెందిన రమేష్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చెత్త సేకరణతో ఉపాధి పొందుతున్నాడు. 15 యేళ్ల క్రితం సరోజ అనే మహిళను వివాహం చేసుకున్న రమేష్, వీరికి ఒక పాప జన్మించిన కొన్ని రోజులకే Divorce తీసుకున్నాడు. పదేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. 

మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కుమారుడితో కలిసి బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి బుధవారం రాత్రి కుమార్తెపై లెంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న అతడి రెండో భార్య రమేష్ ను అడ్డుకుంది. కన్న కూతురు కాకపోయినా తల్లి ప్రేమతో ఆమెను కీచకభర్త నుంచి కాపాడింది. అయినా, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బోయిన్ పల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రమేషన్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందిుతుడిని రిమాండ్ కు తరలించారు. సమావేశంలో ఇన్ స్పెక్టర్ రవికుమార్, సబ్ ఇన్ స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu