
మధిర : తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కన్న బిడ్డలను కర్కశంగా కడతేర్చాడు. ఆ తర్వాత పరారయ్యాడు. మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పార్షపు శివరామ గోపాల్, మార్తమ్మ దంపతులు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తరచుగా ఈ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఇటీవల శివరామగోపాల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందటే విడుదలై వచ్చాడు.
భర్తతో గొడవలు జైలుకు వెళ్లడం కారణంగా భార్య మార్తమ్మ రాయపట్నం గ్రామంలోనే ఉన్న పుట్టింట్లో ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. దీంతో కోపానికి వచ్చిన శివరామ గోపాల్ తన చిన్నారులైన రామకృష్ణ (8), ఆరాధ్య (6)లను దారుణంగా చంపాడు. ఈ చిన్నారులు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, ఒకటో తరగతి చదువుతున్నారు.
పాతబస్తీ మెట్రోపనులపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
ఆదివారం గొడవ నేపథ్యంలో అనంతరం శివరామకృష్ణ సోమవారం స్కూలుకు వెళ్లిన పిల్లలని తీసుకురావడానికి సాయంత్రం స్కూలు వద్దకు వెళ్లి.. రామకృష్ణ, ఆరాధ్యలను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ తరువాత వారిద్దరినీ గొంతు నిలిపి చంపేశాడు. చిన్నారుల మృతదేహాలను దుప్పట్లో మూట కట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. రోజులాగే పిల్లలను తీసుకురావడం కోసం మార్తమ్మ స్కూల్ దగ్గరికి వెళ్లేసరికి.. అక్కడ పిల్లలు లేరు.
స్కూలు సిబ్బందిని ప్రశ్నించగా వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడని తెలిపారు. దీంతో మార్తమ్మ అక్కడికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన మార్తమ్మ చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు విగత జీవులుగా.. దుప్పట్లో చుట్టు కనిపించారు. భార్యతో గొడవల కారణంగా శివరామ గోపాల్ కన్న పిల్లల్ని అతికిరాతకంగా చంపాడని గ్రామస్తులు చెబుతున్నారు.
విషయం పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. శిక్షణ ఐపిఎస్ అధికారి ఎన్ హెచ్ఓ అవినాష్ కుమార్, సిఐ వసంతకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారులు ఇద్దరు మృతదేహాలని మధిర ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న వైరా ఏసిపి రెహమాన్ మృతదేహాలను పరిశీలించారు. శివరామగోపాల్ పై గతంలో కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.